*క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
*శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పీఎస్ కు తరలింపు
*అక్రమంగా అరెస్ట్ చేశారు – పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్,హనుమకొండ: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనను హనుమకొండ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కౌశిక్ రెడ్డి మీద క్యారీ యజమాని కట్ట మనోజ్ రెడ్డిని డబ్బుల కోసం బెదిరించారని కేసు నమోదయింది. దీంతో శనివారం ఎమ్మెల్యే కాశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అక్రమంగా అరెస్ట్ చేశారు.
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో కట్టా మనోజ్ రెడ్డి 2.5 హెక్టార్ల విస్తీర్ణానికి అనుమతి
పొంది ఏకంగా 20 ఎకరాల్లో క్వారీ నిర్వహిస్తున్నాడు. గుండేడు వంగపల్లి గ్రామాల ప్రజలు క్వారీ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.క్వారీ వల్ల ప్రజలు హెల్మెట్లు పెట్టుకుని
తిరగాల్సి వస్తోందని కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడారు..
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
