- ములుగు జిల్లా ఎస్ పి శబరిష్
ఆకేరు న్యూస్, ములుగు: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని యోగ ప్రతి ఒక్కరి కి దినచర్యలో భాగం కావాలని ములుగు జిల్లా ఎస్పీ శబరి సూచించారు.శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ములుగు జిల్లాలోని సాయుధ బలగాల కేంద్రంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. యోగా గురు హరిత సూచనలతో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన చర్య కావాలని అన్నారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా యోగా సాధన చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం తో పాటు ములుగు డిఎస్పి రవీందర్, ఇన్స్పెక్టర్ లు రమేష్, శంకర్, సురేష్, ఆర్ ఐ లు స్వామి సంతోష్ వెంకటనారాయణ, తిరుపతి, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
