
* భారత చలన చిత్ర సీమను మలుపుతిప్పిన సినిమా
*హాలీవుడ్ స్థాయిలో నిర్మించిన సినిమా
* ప్రతీ సన్నివేశం రెప్పవాల్చకుండా చూడాల్సిందే..
* అన్ని విభాగాలూ వంద శాతం పర్ఫెక్ట్గా పనిచేసిన సినిమా
* అమితాబ్ ను ఆకాశానికెత్తిన సినిమా
* అమ్జద్ ఖాన్ కు మరో జన్మనిచ్చిన సినిమా
* ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన సినిమా
* తరతరాలు చూసి తరించే సినిమా
* అల్టిమేట్ క్లాసిక్ సినిమా
* రమేష్ సిప్పీ దర్శకత్వ ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచిన సినిమా
ఆకేరు న్యూస్ డెస్క్ ః అది 1975 వ సంవత్సరం.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ మైలు రాయి.. చరిత్రను సృష్టించిన ఘట్టం.. దేశంలో ఎక్కడ చూసినా షోలే గాలి.. షోలే మానియా .. దేశంలోని అన్ని నగరాల్లో వారాల తరబడి ఆడిన సినిమా.. అదే షోలే.. పాత తరం అయినా..కొత్త తరం అయినా..షోలే సినిమాను రెప్పవాల్చకుండా చూడాల్సిందే… ఆ సినిమాల్లో ప్రతీ సన్నివేశం ఓ అద్భుతమే.. అతిరథ మహారథులు నటించిన సినిమా.. అప్పటికే ఆలిండియా సూపర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ మరో పక్క ధర్మేంద్ర.. తనదైన నటనతో సింప్లీ సూపర్బ్‌గా కన్పించే సంజీవ్ కుమార్, సిగ్ధసౌందర్యంగా కన్పించే జయబాదురి.. చలాకైన పాత్రలో ధర్మంద్రకు జోడీగా డ్రీం గర్ల్ హేమమాలిని
లేలేత వయస్సులో అందరినీ ఆకట్టుకున్న సచిన్.. కామిడీ పాత్రలో అస్రాని..ఇదంతా ఒక్కైత్తు అయితే విలన్ పాత్రకే గ్లామర్ తెచ్చి భారతీయుల హృదయాల్లో గబ్బర్ సింగ్ గా ముద్రవేసిన అమ్జద్ ఖాన్.. అంతెందుకు 2012లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందిన ‘గబ్బర్ సింగ్’కు ఆ టైటిల్ పెట్టుకున్నందుకు ‘షోలే’ మేకర్స్ కు రాయల్టీ చెల్లించారు. దీనిని బట్టే గబ్బర్ సింగ్ పాత్ర ఎంతలా జనం మదిలో నిలచిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈ సినిమాలో నటనాపరంగా అతిరథమహారథులు.. నిర్మాణ పరంగా చూస్తే ఆ రోజుల్లో అది అత్యంత ఖరీదైన చిత్రం.. మ్యూజిక్..ఎడిటింగ్,,స్క్రీన్ ప్లే…యాక్షన్..సెంటిమెంట్.. కామిడీ.. ఎమోషన్ అన్ని వంద శాతం పండించిన సినిమా ఇది… ఆరోజుల్లో కుర్రాళ్లు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మామూలుగా వెళ్లే వారు కాదు.. అరే ఓ సాంబా.. అరు ఓ కాల్యా.. కిత్నే గోలీ హైరే అంటూ డైలాగులు చెప్పుకుంటూ వెళ్లేవారు. అంతే కాదు ఇందులోని పాత్రల పేర్లు మహాభారతంలోని పాత్రల పేర్లలా జనాల నోళ్లలో నానాయి. వీరూ ( ధర్మంధ్ర) జయ్ (అమితాబ్) బసంతి ( హేమమాలిని ) రాధా ( జయబాదురి )గబ్బర్ సింగ్ (అమ్జద్ ఖాన్ ) ఠాగూర్ ( సంజీవ్ కుమార్) అలాగే కాల్యా..సాంబా లాంటి చిన్న పాత్రల పేర్లు కూడా జనాల నోళ్లలో నానాయి. అంటే అప్పట్లో అసినిమా జనాలను అంతగా ప్రభావితం చేసింది… ఈ సినిమా బొంబాయిలో ఐదు సంవత్సరాలు నిరవధికంగా ఆడి రికార్డులు బ్రేక్ చేసింది. షోలే గురించి చెప్పాలంటే మహా భారతంలో ఉన్నన్ని కథలు ఉంటాయి. షోలే విడుదలయిన తరువాత 20 ఏళ్ల వరకూ ఆ సినిమా రికార్డులను ఏసినిమా బ్రేక్ చేయలేకపోయింది… వంద థియేటర్లలో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. బీబీసీ నిర్వహించిన ఓ సర్వేలో షోలేను 20 వ శతాబ్దపు సినిమాగా గుర్తించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ నిర్మించిన రామకృష్ణ థియేటర్ లో ఈ సినిమా 76 వారాల పాటు ప్రదర్శితమయింది. హైదరాబాద్ లో ప్లాటినమ్ జూబ్లీ చూసిన తొలి చిత్రంగా ‘షోలే’ నిలచింది. అయితే గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్న ఈ సినిమా ‘షోలే’ ఒరిజినల్ నెగటివ్ పాడయి పోయింది.దాంతో ముంబైలో అందుబాటులో ఉన్న ‘షోలే’ కాపీని, బ్రిటిష్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో భద్రపరచిన కాపీని జోడించి దానితోనే మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ‘షోలే’ను రీస్టోరేషన్ చేశారు. ఈ ప్రింట్ ను జూన్ 27వ తేదీన ఇటలీలోని ప్లాజా మేగోర్ లో ప్రదర్శించనున్నారు. యాభై ఏళ్ళ తరువాత ప్రీమియర్ షో గా ‘షోలే’ ప్రదర్శితమవ్వడమే కాదు, ఓ చరిత్రగా నిలచిపోతుందని మేకర్స్ అంటున్నారు.భారత దేశంలో సైతం ఆగస్ట్ 15న 50 యేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.
…………………………………..