
ఆకేరు న్యూస్ ములుగు ః జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరుతపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అభయ మిత్ర పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఏటూర్ నాగారం ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆశ్రమ డ్రగ్స్ ను తరిమికొడదాం – యువతను కాపాడుకుందాం అనే అంశంపైఅవగాహన కల్పించారు .తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మూడు వీడియోలను విద్యార్థిని విద్యార్థులకు ప్రొజెక్టర్ సహాయంతో చూపించారు.విద్యార్థిని విద్యార్థులు యుక్త వయస్సు వచ్చేవరకు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చెడు వ్యసనాలైన డ్రగ్స్ మత్తు పదార్థాలను అలవాటు చేసుకోరాదని, అవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని, ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా నష్టపోతారని తెలియజేశారు . ప్రతి ఒక్కరు డ్రగ్స్ ని అరికట్టే దిశగా బాధ్యతాయుతంగా ఉండాలని నిర్దేశించారు. ఈకార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ.బండారి కుమార్, ఎస్.ఐ కె.తిరుపతిరావు, శిక్షణ ఎస్.ఐ జి. తిరుపతి, మండల ఎంఇఓ G.V.V. సత్యనారాయణ, ఆశ్రమ పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు వై.బాబురావు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….