* పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: రౌడీ షీటర్లూ జాగ్రత్తగా ఉండండి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్నా..
, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టపరమైన శిక్ష తప్పదని పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి హెచ్చరించారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో సిఐ జానకి రామిరెడ్డి పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రౌడీ షీటర్లు అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు, భూమి సెటిల్మెంట్లు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఇతర విషయాలలో రౌడీషీటర్లు సాధారణ ప్రజలను భయభ్రాంతులను గురిజేసి డబ్బులు గుంజడం లాంటివి చేస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని అన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉన్నవారిని విచారణ చేసి రౌడీ షీట్స్ తొలగించడం జరుగుతుందని వివరించారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని సిఐ జానకిరామ్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై పవన్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
