*కొండా మురళి..ఎమ్మెల్యేల వివాదంలో నందిరాం నాయక్
*నందిరాం నాయక్ కొండా మురళికి అనుకూలంగా
వ్యవహరిస్తున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్, హనుమకొండః రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోలీస్ ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో బాగంగానే బదిలీల ప్రక్రియ సాధారణంగా జరిగినట్లు కన్పించినా నందిరాం నాయక్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి అనుకూలంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అనంతర పరిణామాల నేపధ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు,కొండా మురళి మధ్య మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడింది.పరస్పర ఆరోపణల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించింది.దీంతో శనివారం కొండా మురళి గాంధీ భవన్ లో క్రమశిక్షణా కమిటీ ముందు వివరణ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఏసీపీ నందిరాం నాయక్ బదిలీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
