
*విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
*కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి
* రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, రామగుండం ః శాంతి భద్రతల,నేరాల నియంత్రణ విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గారు ముందుగా పోలీస్ స్టేషన్, డివిజిన్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ….కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రతి రోజు ఒక గంట పాటు పెండింగ్ కేసులను సమీక్షా జరపాలన్నారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాల్సిందిగా అలాగే మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగం స్పందించాలని, రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని పోలీస్ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ .భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు సిసి హరీష్ పాల్గొన్నారు.
……………………………………………