
– జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష
ఆకేరు న్యూస్, జనగామ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను నిర్మాణాలకు సంబందించి ఇసుక, కంకర తదితర విషయాలలో అధిక ధరలతో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లు గ్రామంలో హౌసింగ్ పీడీ మాతృ సింగ్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనితీరు గురించి ఇసుక, సిమెంట్, కంకర ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంతకు తెచ్చారని లబ్ధిదారున్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇసుక, కంకర, స్టీల్ పేరుతో లబ్ధిదారుల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి నిర్మాణాలకు సరిపోను ఇసుక స్టేషన్ ఘనపూర్ డివిజన్ లోని కొత్తపల్లి, తాటికొండ రీచులలో సమృద్ధిగా ఉందని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది అన్నారు. ఇసుక లోడింగ్, రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం లో వారి నుండి అధిక మొత్తం వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దశల వారీగా పూర్తి చేసుకున్న నిర్మాణాలకు ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇసుకను వేగవంతంగా లబ్ధిదారునికి అందించేందుకు కూపన్స్ విధానము అమలు పరుస్తున్నామని, మరింత వేగవంతం చేసేందుకు మొబైల్ ద్వారా కూడా కూపన్లు ఇచ్చేవిధంగా వెసులుబాటు కల్పిస్తామన్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ పీడీ, తాహసిల్దార్, ఎంపీడీవో అధికారులతో వివిధ అంశాల పైన కలెక్టర్ రివ్యూ చేసి పలు సూచనలు ఇచ్చారు. మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా సిబ్బంది ని నియమించి ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షణ చేపించాలన్నారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ రెంట్, ప్రాపర్టీ టాక్స్, హాస్పిటల్, రెస్టారెంట్, తదితర కమర్శియల్ రెంట్, వాటర్ టాక్స్ లక్ష్యానికి తగ్గట్టు వసూలు కావాలన్నారు. ఇందుకోసం టీమ్స్ వేయాలన్నారు. శానిటేషన్ కి మొట్ట మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపల్ లో ఏమైన సమస్య లు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మల్టి పర్పస్ వర్కర్ లు పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
………………………………………………..