ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలను బుదవారం కార్యాలయ ఆవరణంలో జిల్లా సంక్షేమ శాఖ, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రెండు మోటారు వెహికల్స్ పంపిణీ చేశారు. ములుగు జిల్లా లోని కోడిసెలకుంట గ్రామానికి చెందిన బనోతు యాకూబ్, నర్సాపూర్ లో గుర్రం శ్రీహరి లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు . ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని దివ్యాంగులు సద్విని చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి టి.రవి, సి.డి.పి.ఓ. శిరీష, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
