* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: వ్యవసాయ రంగంలో నానో యూరియాతో సత్ప్రలితాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుదవారం మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలోని స్నేహ రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ కేంద్రం లో వ్యవసాయ శాఖ, ఇఫ్కో సంయుక్త ఆధ్వర్యం లో నానో యూరియా ప్లస్, నానో డీఏపీ పై ( డ్రోన్ తో పిచికారి చేసే )అవగాహన సదస్సు లో కలెక్టర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో డ్రోన్ ద్వారా నానో యూరియా ద్వారా పొలాల్లో వేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని అన్నారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా యూరియాను ద్రవ రూపంలో తీసుకొచ్చారని తెలిపారు. సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించుటకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని, నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను, అధిక దిగుబడి, ఖర్చు తగ్గడం, భూసార పరిరక్షణ, పర్యావరణహితం కలు గుతుంద న్నారు.అంతే కా కుండా లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. పంట సాగుకు ముందుకువచ్చే రైతులకు ప్రభుత్వ సబ్సిడీలతో పాటు, అన్ని విధాల తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వి.సురేష్ కుమార్, ఇఫ్ఫ్కో డిఎం విశాల్ షిండే, స్నేహ ఎఫ్ పి ఓ సి ఈ ఓ చాంద్ పాషా, ఎఫ్ పి ఓ డైరెక్టర్లు అశోక్, పోరికా ప్రమేలా, కవిత, ఎం పి డి ఓ హనుమంత్ రావు, , టిజివిబి బ్యాంక్ మేనేజర్, మండల వ్యవసాయ అధికారులు నల్లెల్లా శ్రీధర్, పరమేశ్వర్, ఏ ఈ ఓ రామ్చంద్రాపూర్ కావ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………
