* కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి హత్య..!
ఆకేరు న్యూస్ వర్దన్నపేట : భర్తతో చేదోడు వాదోడుగా ఉంటూ సంసారం ఒక నావలా ముందుకు సాగించాల్సిన భార్యకు ఓ భర్త బరువయ్యాడు. మద్యం మత్తులో ఉన్న భర్తకు ఓ భార్య థమ్సప్( కూల్ డ్రింక్) లో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్య చేసింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవాని కుంట తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ నెల 8న దాటుడు పండుగనాడు భార్య కాంతికి చికెన్ తెచ్చి వండమని భర్త జాటోత్ బాలాజీ(40)ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. తాను మద్యం సేవించి వస్తానని భార్యతో చెప్పి బయటకు బయల్దేరాడు.అతను ఇంటికి తిరిగి వచ్చే సరికి పథకం ప్రకారం ఇంట్లో ఉన్న గడ్డి మందును కూల్ డ్రింక్ లో కలిపి పెట్టింది భార్య. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు పురుగుల ముందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వగా అది తాగిన బాలాజీ కొద్దిసేపటి తర్వాత గొంతు మండుతుందని కేకలు వేస్తూ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. మృతి చెందలేదని గమనించిన భార్య కాంతి తన బావ వాంకుడోతు దస్రు (40) ఇంటికి వెళ్లి ఏం తెలియనట్లు కూర్చుంది. బాలాజీని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి జాటోతు హరిచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్.ఐ చందర్ తెలిపారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
