ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది, ఇబ్రహీం పట్నం బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వాహనాలు పెద్ద అంబర్ పేట నుంచి బొంగులూరు వైపు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ముగ్గురిని గుర్తించారు మాలోతు చందూలాల్,గగులోతు జనార్దన్,కావలి బాలరాజుతో పాటు మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
……………………………………….
