ఆకేరున్యూస్ హనుమకొండః హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మైనింగ్ డిప్లొమా మూడో సంవత్సం చదువుతున్న 19 ఏళ్ల వయసున్న అక్షయ్ తాను అద్దెకె ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు సుబేదారి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి స్వగ్రామం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలిపురం అని తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
