* మంత్రి సీతక్క
* ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రీ సీతక్క,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించిందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నదన్నారు. మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ప్రతి మహిళను సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మహిళా సంఘాలకు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశామని అన్నారు.రాష్ట్రంలోని మహిళా సంఘాలకు లక్షల కోట్లు కేటాయించడంతో పాటు వడ్డీ రుణమాఫీ చేసిన ఘనత తమ దేనని, మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. ములుగు జియోజకవర్గం లో 9 మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6 వేల 904 స్వయం సహాయక సంఘాలు, 69,736 స్వయం సహాయక సంఘాల కు బ్యాంకు లింకేజీల ద్వారా 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 249.07 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని, 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను 618 స్వయం సహాయక సంఘాలకు 54.79 కోట్ల రుణాలను అందించడం జరిగిందని వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన 5109 స్వయం సహాయక సంఘాల లోని సభ్యులకు మహిళా 884.53 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరిగిందని, 5212స్వయం సహాయక సంఘాల లోని 52615 మంది సభ్యులకు 10 కోట్ల 74 లక్షల వడ్డీ లేని రుణాలను మహిళా శక్తి సంబరంలో అందించడం జరిగిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబం కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను అందజేయడంతో పాటు లోన్ బీమా పథకం, ప్రమాద బీమా పథకం ఏర్పాట్లు, కొత్త సంఘాల ప్రారంభం, స్త్రీ నిధి రుణాలు అందజేయడం, మైక్రో ఎంటర్ప్రైజెస్, పాడి గేదెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పౌల్ట్రీ మదర్ యూనిట్, సంచార చేపల విక్రయ కేంద్రం, వ్యవసాయ అనుబంధ జీవనోపాధి కల్పన కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఏర్పాటు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు తదితర కార్యక్రమాలను మహిళా సంఘాల చే నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
* భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు.
మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనెక కార్యక్రమాలు చేపట్టిందని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన చెక్కుల పంపిణీ కర్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల చేతిలో డబ్బులు ఉండాలని లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు.
పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు సి ఈ ఓ సేర్ఫ్ పి. కాత్యాయనిదేవి,, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….
