విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
*విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేయాలి
* సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమావేశం
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి వారి భవిష్యత్‌కు తోడ్పాటు అందించాలని, విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ( Seethakka ) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ హాస్టల్లు, సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల మీద నమ్మకం కలిగి ఈ 2025-26 విద్యా సంవత్సరం వసతి గృహాల్లో చదివే విద్యార్థులశాతం పెరిగిందన్నారు. చదువుకోవడానికి సుదూర ప్రాం తాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడి వాతావరణం అలవాటయ్యే వరకూ ప్రిన్సిపాళ్లు శ్రద్ధ వహించాలని, వారి మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ హాస్టళ్లను ఆర్బీఎస్ కే బృందాలు సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయాలని, వంటకు నాణ్యమైన సరుకులను వినియోగించాలన్నా రు. విద్యార్థుల వసతి గదులు, పడకలు, మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. శుద్ధమైన తాగునీటిని అందించాలని చెప్పారు.పారిశుధ్యం, రోజువారీ మెనూ, ప్రతీ విద్యార్థి హెల్త్ చార్ట్, వైద్య శిబిరా ల ఏర్పాటు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టే విధంగా వార్డెన్లు కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ, ప్రతీనెల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు.విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, ఆహార తయారీ ప్రదేశాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలగకూడదని, పాఠశాలలో పరిశుభ్రత, పారిశుద్య ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట గది, డైనింగ్ హాల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాని హెచ్చరించారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అనారోగ్య బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.
విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
పిల్లలు ఏమైనా మత్తు పదార్థాలు వాడినట్లయితేవారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. గత సంవత్సరం ఏలాంటి సమస్య లేకుండా ఇంటర్ లో ప్రథమ స్థానంలో, టెన్త్ లో ములుగు జిల్లాకు 8 వ స్థానం రావడం జరిగిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మొదటి స్థానం ఉండే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు సంక్షేమ శాఖ అధికారులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ 83 హాస్టల్ ల వార్డెన్లు, టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————

