* రైల్వే కోచ్ లే కాదు.. మెట్రోరైళ్లూ ఇక్కడ తయారీ
* వచ్చే ఏడాదే అందుబాటులోకి..
* రూ.500కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు
* కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
* ఫ్యాక్టరీ సందర్శన
ఆకేరు న్యూస్, వరంగల్ : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ (COACH FACTORY)అనేది వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. వరంగల్ జిల్లా కోరికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారని తెలిపారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని వెల్లడించారు. ఫ్యాక్టరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఇక్కడ మెట్రో కోచ్ లు కూడా తయారు అవుతాయని అన్నారు. వచ్చే ఏడాదే ఇక్కడ రైల్వే కోచ్ ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్ లు ఎగుమతి అవుతాయని కేంద్రమంత్రి అశ్విన్ (ASWHIN)వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన కోచ్ ఫ్యాక్టరీ ఇది అని, దీని కోసం రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. డిసెంబర్ చివరికల్లా ఇంజనీరింగ్ పనులను పూర్తి చేసి, 2026లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈమెగా ఫ్యాక్టీరీ(MEGA FACTORY)లో రైల్వే కోచ్ లు, ఇంజన్లు, మెట్రోరైళ్లు తయారవుతాయని వివరించారు. అన్ని రకాల రైళ్లను ఇక్కడ తయారుచేసేలా పరిశ్రమను సిద్ధం చేశామన్నారు.
——————-
