
ఆకేరున్యూస్ హైదరాబాద్ : రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటిరూపాయల నజరానా నను ప్రకటించింది.అతి సాధారణ కుటుంబంలో పుట్టిన రాహుల్ సిప్లిగంజ్స్వయం కృషితో మంచి గాయకుడిగా ఎదిగాడు. అతని టాలెంట్ ను గుర్తించిన సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మందు కాంగ్రెస్ పార్టీ తరపున పది లక్షల ఆర్థిక సాయం ఇచ్చిన విషయం తెల్సిందే.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని రేవంత్ ప్రకటించారు. పాతబస్తీలో బోనాల పండగ జరుగుతున్న నేపధ్యంలో రాహుల్ కు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. త్రిబుల్ ఆర్ సినిమాలో రాహుల్ పాడిన నాటు నాటు పాట అంతర్జాతీయంగా మంచి ఆదరణ పొందిన విషయం తెల్సిందే.. ఈ పాటను కంపోజ్ చేసినందుకు గాను సంగీత దర్శకుడు కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చింది.
…………………………………………..