జగపతిబాబు , నారా లోకేశ్
* నవ్వులు పూయిస్తున్న ప్రోమో
Jayammu Nischayammura Season 2| ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జీ5 తెలుగు సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. స్కూల్ రోజుల అల్లరి నుంచి కుటుంబానికి సంబంధించిన సరదా సంఘటనల వరకు లోకేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
స్కూల్ రోజులు
చిన్నతనంలో స్కూల్లో ఎక్కువగా టీచర్ల నుంచి పనిష్మెంట్లు పొందేవాడినని లోకేశ్ సరదాగా వెల్లడించారు. తాను అంత అల్లరి చేసేవాడినా? అని జగపతిబాబు ప్రశ్నించగా.. తన మామయ్య నందమూరి బాలకృష్ణతో పోటీ పడాల్సి వచ్చేదని చమత్కరించారు. దీంతో షోలో నవ్వులు పూశాయి.
పెళ్లి ముచ్చట్లు
తన పెళ్లి సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఒకరోజు తనను ‘అల్లుడుగారు’ అని పిలవడంతో, ఏదో ఫిట్టింగ్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారేమోనని అనుకున్నట్లు నవ్వుతూ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బాలయ్య గురించి
నందమూరి బాలకృష్ణ గురించి కూడా లోకేశ్ ఆసక్తికరంగా మాట్లాడారు. బాలయ్య తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
బాలయ్య డైలాగ్‌తో హంగామా
ప్రోమో చివర్లో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలోని ప్రముఖ డైలాగ్‌ను లోకేశ్ తనదైన శైలిలో చెప్పారు. “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!” అంటూ బాలయ్య స్టైల్‌ను అనుకరించి అలరించారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి.
ఎప్పుడంటే?
‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో నారా లోకేశ్ పాల్గొన్న ఎపిసోడ్ నవంబర్ 6న జీ5లో ప్రీమియర్ కానున్నట్లు సమాచారం. అనంతరం నవంబర్ 8న సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో లోకేశ్ మరిన్ని వ్యక్తిగత విశేషాలు, సరదా సంఘటనలను పంచుకోనున్నట్లు ప్రోమో సూచిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

