
* ఒకే మహిళను పెళ్ళి చేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు
* హిమాచల్ ప్రదేశ్ లో అంగరంగ వైభవంగా పెళ్ళి
* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వేడుక వీడియోలు
ఆకేరు న్యూస్, డెస్క్: మహాభారతంలో సీన్ మరో సారి సాక్షాత్కరించింది. స్వయంవరంలో అర్జునుడిని గెలిచిన ద్రౌపదిని. కుంతీ దేవి మాట ప్రకారం ఐదుగురు అన్నదమ్ములు భార్యగా స్వీకరించారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకున్నది. ఒకే మహిళను ఏకంగా ఇద్దరు అన్నాదమ్ములు పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడీ పెళ్ళి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళితే.. ప్రదీప్, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నాదమ్ములు సునీత చౌహాన్ అనే యువతిని పూజారి మంత్రోచ్చారణ మద్య అంగరంగా వైభవంగా జరిగిన వేడుకలో తాళి కట్టారు. మూడు రోజులు ఆటా- పాటలతో ఈ పెళ్ళి ఆడంబరంగా జరిగింది. పెళ్లి కుమారులు ప్రదీప్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా, కపిల్ నేగీ మాత్రం విదేశాల్లో ఉంటున్నాడు.
* తరతరాల సంప్రదాయం
హిమాచల్ ప్రదేశ్- ఉత్తరఖండ్ సరిహద్దు ప్రాంతమైన షిర్మూర్ జిల్లాలోని షిల్లాయి గ్రామంలోఈ పెళ్లి జరిగింది. పెళ్ళి కూతురు సునీత చౌహాన్ సమీప కున్ హత్ గ్రామం. హట్టి అనే గిరిజన తెగలో జోడీదార్ అనే సంప్రదాయంలో భాగంగా ఒకే మహిళ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటారు. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని తెగ పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి పెళ్ళి చట్ట బద్దం కూడా అంటున్నారు. సమాజంలో వచ్చిన మార్పులు , విద్య, మహిళా సాధికారత , చైతన్యం వల్ల ఈ సంప్రదాయానికి దూరమయ్యా మంటున్నారు. పెళ్ళి కూతురు సునీత సైతం తాను ఇష్ట పూర్వకంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇద్దరిని పెళ్ళి చేసుకున్నానని చెబుతున్నారు.. వీరి పెళ్లి ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..
—————————————