
* హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి
* ఆంక్షలు వర్తిస్తాయ్ అని పోలీసుల వెల్లడి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (HariHara Veeramallu) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినిమా యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వడంపై సస్పెన్స్ ఏర్పడింది. చివరిరోజు వరకు అనుమానాలు వ్యక్తం కాగా, ఎట్టకేలకు ఓకే చెప్పారు. అయితే.. కొన్ని షరతులు విధించారు. కేవలం 1500 మంది వరకే అనుమతి ఇచ్చారు. అంతేకాదు.. శిల్ప కళావేదిక బయట, లోపల ఏం జరిగినా, నిర్మాతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 100 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. కాగా ఈ సినిమాకు నిర్మాత ఏఎం.రత్నం. డైరెక్టర్ జ్యోతికృష్ణ. సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి.
……………………………………