Narendra modi visits Telangana
* నక్సలిజం నిర్మూలనకు కృషి
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయంతో ప్రపంచం మొత్తానికి మన సైనికుల సత్తా తెలిసిందని, మేడిన్ ఇండియా ఆయుధాలపై అందరి దృష్టీ పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ((Parliament Monsoon Session) ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. భారతసైన్యం తమ లక్ష్యాలను 100శాతం పూర్తి చేసిందని కొనియాడారు. సైనకుల గొప్ప పోరాటాలపై విజయోత్సవాలను జరుపుకోవాలన్నారు. ఇక ఐఎస్ ఎస్‌లో శుభాంశుశుక్లా త్రివర్ణ జెండా ఎరగవేయడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం గురించి మన దేశ ఎంపీలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటించి వివరించారని మోదీ గుర్తు చేశారు. పాక్ దుష్ట చర్యలను అంతర్జాతీయంగా ఎండగట్టినట్లు చెప్పారు. తుపాకులు, బాంబులు ఉన్నా మన రాజ్యాంగం ముందు నిలబడలేకపోయాయని స్పష్టంచేశారు. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై వేడుక చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలూ, ప్రతీ ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే.. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఎన్డీఏ కూటమి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ (Modi) వివరించారు.
……………………………………….
