* ఐదు నిమిషాల ఆలస్యానికి బోర్డు ఆమోదం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే నిబంధన లాస్ట్ ఇయర్ అమలుకాగా, ఈసారి అమలు చేయనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. 9లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగబోతున్నాయి. ఇవి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రానున్నాయి.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
