
* బెట్టంగ్ యాప్ లపై విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః బెట్టింగ్ యాప్ లతో ప్రమేయం ఉన్నా సినీ నటులు రానా,ప్రకాశ్ రాజ్ ,మంచులక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రానాను 30న ప్రకాశ్ రాజ్ ను,ఆగస్టు 6న విజయ్ దేవర కొండ ఆగస్టు 13న మంచులక్ష్మిలను విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన బెట్టింగ్ యాప్ ల వ్యవహారంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే . వీరితో పాటు యూ ట్యూబ్ ప్రమోటర్లు. టీవీ యాంకర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరందరూ నియమ నిబంధనలకు విరుద్ధంగా యాప్ లను ప్రమోట్ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
……………………………………………….