
ఆకేరు న్యూస్, మెదక్ : విద్యుదాఘాతంతో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళం మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో రూ.3 లక్షల మేర తమకు ఆస్తి నష్టం జరిగిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
………………………………………………..