
* తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
* తాజా అప్డేట్ ప్రకారం ఏ జిల్లాల్లో ఎలా ఉంటుందంటే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Meteorological Centre, Hyderabad) హెచ్చరించింది. ఈమేరకు కేంద్రం హెడ్ నాగరత్నం తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏయే జిల్లాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆమె వివరించారు. తెలంగాణలోని నిర్మల్(Nirmal), కొమరం భీమ్, మంచిర్యాల (Manchiryala),పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈమేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు. రెండు, మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగురు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. ఏపీ కోస్తా తీరం వెంట ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. కామారెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వరంగల్(Warangal), హనుమకొండ, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
…………………………………………….