
* రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతం చేద్దాం
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్ హనుమకొండ: అధికారులందరు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను విజయవంతం చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో మామూనూర్ పిటిసి వేదికగా త్వరలో జరుగబోయే రెండవ రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణపై డ్యూటీ మీట్ పరిశీలన బృందంతో సభ్యులు, కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మామూనూర్ పిటిసిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా డ్యూటీ మీట్ పరిశీలకులు, పోలీస్ అధికారులతో కలసి పోటీలు నిర్వహిస్తున్న పిటిసిలో విభాగాల వారిగా పోటీలు నిర్వహించే ప్రదేశాలు, ఆలాగే పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వస్తువుండడంతో వీరికి అవసరమైన మౌలిక సదుపాయల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జరిగిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా ఈ పోటీలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అతిధ్యం ఇస్తుండడంతో పోటీల నిర్వహణకై డిసిపిలు, ఎసిపిలు స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలను నియమించాలన్నారు. ముఖ్యంగా ఈ పోటీలకు సజావుగా నిర్వహించేందుకుగాను చేయాల్సిన ఏర్పాట్లపై న్యాయనిర్ణేతలు, పరిశీలన నిపుణులు పోలీస్ కమిషనర్‌కు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతి పెద్దనగరంమైన వరంగల్ నగరంలో రెండవ డ్యూటీ మీట్ నిర్వహిస్తుండడంతో ఆనందంగా వుందన్నారు. ఈ పోటీల నిర్వహణకు నియమించిన కమిటీ సభ్యులు వారికి అప్పగించిన విధులను విజయవంతంగా పూర్తి చేయాలని, ఈ పోటీలకు సంబంధించి ఎలాంటి అనుమానాలు వున్నా తన దృష్టికి తీసుకరావాలని, పోటీలకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు ముందస్తూ ప్రణాళికతో పనిచేయాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, పిటిసి ప్రిన్సిపాల్ పూజ,సి.ఐ.డి ఎస్.పి రాంరెడ్డి, కమాండెంట్ రామకృష్ణ, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్,శ్రీనివాస్,ప్రభాకర్ రావుతో పాటు, వరంగల్ పోలీస్ కమిషనరేట్, సిఐడి, రాష్ట్ర సెక్యూరీటీ విభాగంకు చెందిన ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఆర్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
…………………………………………