
ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో హల్ చల్ చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాఠశాలలు, ఫర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేశారు. రఘునాథ్ పల్లి మండల కేంద్రంలోని వెంకటేశ్వర, లక్ష్మి ఫర్టిలైజర్ షాప్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపుల ముందు స్టాక్ బోర్డులపై ఎరువుల వివరాలు నమోదు చేయకపోవడం పట్ల కలెక్టర్ షాప్ యజమానిని మందలించారు. ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని సూచించారు. స్టాక్ బోర్డులపై వివరాలను నమోదు చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సరిపడా యూరియా నిలువలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎవరెవరికి ఎంత యూరియా అమ్ముతున్నారో ఫోన్ నెంబర్ తో సహా అన్ని వివరాలు ఉండాలి అని ఫర్టిలైజర్ షాపు యజమానులకు సూచించారు. అంతకు ముందు రఘునాథ్ పల్లి ZPHS స్కూల్ ని ఆకస్మికం గా సందర్శించి టీచర్లు ఎంత మంది వచ్చారు, ఎంత మంది లీవ్ పెట్టారు అని అటెండన్స్ రిజిస్టర్ ని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వండుతున్న పరిశీలించారు. వంటశాలలో పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
…………………………………………….