
* మంత్రి సీతక్క
*ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్ల వాగు,జలగలంచ
ఆకేరున్యూస్, ములుగు : భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని
మంత్రి సీతక్క ములుగు,మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ములుగు జిల్లా లోని పసర తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ గుండ్ల వాగు వరుద ఉదృతిని మంత్రి పరిశీలించారు.
ములుగు జిల్లాలో భారీ వర్షాలు నిన్నటి నుండి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా జిల్లా ప్రజలకు అందుబాటులో ములుగు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందిని ప్రజలకు ఏమైనా సందేహాలుంటే ఈ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి సీతక్క గారు ప్రజలను కోరారు. రైతులు ముఖ్యంగా విద్యుత్తు షాక్ ప్రమాదాల గురి కాకుండా జాగ్రతగా ఉండాలని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జాలరులు చేపల వేటకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదే విధంగా గ్రామాలలో శిథిలవ్యవస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు కింది స్థాయి అధికారులతో మానేటరింగ్ చేయాలని సూచించారు .ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………