
* పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రాభావంతో తలంగాణ రాష్ట్రంలో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు IMD ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్లు జారీ చేసింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, హైదరాబాద్ నగరంలో గత అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరముంటే తప్ప బయటకు రావద్దని పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నగర ప్రజలకు సూచించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కలెక్టర్ దాసరి హరిచందన,జీహెచ్ ఎంసీ కమిషనర్ కర్ణన్,హైడ్రా కమిషనర్ రంగనాధ్
మెట్రో వాటర్ వర్క్ప్ అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగగా లోతట్టు ప్రాంతాల్లో అదికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైచర్చించారు.141 వాటర్ టాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
……………………………………