
నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
* తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు
* ఇంకా కొలిక్కి రాని నీట్ స్థానికత అంశం
ఆకేరు న్యూస్ : నీట్ విద్యార్థుల స్థానికత విషయంలో త్వరగా పరిష్కారం చూపాలని సుప్రీం కోర్టు
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీట్ పరీక్షరాయడానికి ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే స్థానికత వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ నేపధ్యంలో కొంతమంది విద్యార్థులు ఈ అంశంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు చెల్లవని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గతేడాది పిటిషనర్లకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. అయితే తెలంగాణలో పుట్టి పదోతరగతి వరకు చదువుకొని ఇంటర్మీడియట్ విద్య కోసం ఇతర ప్రాంతాలకు పోయిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం విధించిన నిర్ణయం వల్ల నష్టపోతున్నారు. నీట్ పరీక్షకు మందు వరుసగా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో చదువుకొని ఉండాలనే నిబంధన వల్ల తాము తెలంగాణలో పట్టి పెరిగినా కేవలం ఇంటర్మీడియట్ ఇతర ప్రాంతంలో చదివినంత మాత్రాన నీట్ లో లోకల్ గా పరిగణించకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నీట్ స్థానికతపై ఓ నిర్ణయానికి రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఆగస్టు 5కు వాయిదా వేసింది.
……………………………………..