విజయవాడ
* మృతుల్లో డాక్టర్ దంపతులు, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలు
* హత్యా.. ఆత్మహత్యా..?
* విజయవాడ గురునానక్ నగర్ లో విషాదం
ఆకేరు న్యూస్, విజయవాడ :
ఏపీలోని గురునానక్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబంతో గురునానక్ నగర్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరూ మృతి చెంది ఉన్నారు. మృతుల్లో డాక్టర్ దంపతులతో పాటు, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలు ఉన్నారు. ఆ కుటుంబం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య.. ఆత్మహత్య.. అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఇంటి పరిసరాల్లో పరీశీలిస్తున్నారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
