విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత గుండేటీ నరేందర్
* కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్ : కొండా సుస్మిత పటేల్ బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆయన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ సుస్మిత స్థాయికి మించి మాట్లాడుతున్నారు. మంత్రి పదవిని నిలుపుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. సుస్మిత పటేల్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్ మాట్లాడుతూ వరంగల్ తూర్పులో బీసీలను అణగతొక్కడమే వాళ్ల పనిగా మారిందన్నారు. తాము పార్టీ కోసం పని చేస్తుంటే తమతో వచ్చిన వారి పై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కొండా సురేఖ బీసీ మహిళ అయి ఉండి వరంగల్ తూర్పులో బీసీలనే ఎదగకుండా చేస్తున్నారన్నారు. 350 గొర్రెలు దహనం కావడానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయించారని ఆరోపించారు. బీసీ వాదం ముందు పెట్టి వారు చేసే తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
