ముద్రగడ పద్మనాభం
* సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో కాదు..
* పిఠాపురంలో పవన్ ను తన్నితరిమేయడం ఖాయం
* త్వరలో జనసేన ప్యాకప్
* పవన్‌కల్యాణ్‌పై కాపు నేత ముద్రగడ ఫైర్
ఆకేరు న్యూస్, కాకినాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపునేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభమే కాదని, పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తునిలో రైల్వే ఘటనకు చంద్రబాబే కారణమని, ఇది పవన్ తెలుసుకోవాలని సూచించారు. సినిమాల్లో నటించాలి కానీ, రాజకీయాల్లో కాదని తెలిపారు. పిఠాపురంలో పవన్ ను ప్రజలు తన్ని తరిమేయడం ఖాయమని చెప్పారు. పనిలోపనిగా ప్రముఖ సినీ నటులు చిరంజీవిపై కూడా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, పోలవరం గురించి చిరంజీవి ఎందుకు బయటకు రాలేదని, ఇప్పుడు కూటమి మద్దతుగా వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా.. అని ప్రశ్నించారు. అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, జనసేన త్వరలో ప్యాకప్ అవుతుందని జోస్యం చెప్పారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
