
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినందున లోతట్టు ప్రాంతాలలో మరియు గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలియజేశారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు .వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినదని ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షిణ సహాయం కోసం జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు (DDRF) బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విపత్కార పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, Dail 100 ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
…………………………………………….