
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. బుదవారం వెంకటాపురం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ని అన్ని రికార్డులను, రిజిస్టర్ లను, గదులను ఇన్వార్డ్ రోగి వార్డులను పరిశీలించారు . డాక్టర్లు వైద్య సేవలు సిబ్బంది సేవలు బాగున్నాయని రోగులు తెలియజేయగా, కలెక్టర్ సంతృప్తిని వ్యక్తపరిచారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్ రూమును పరిశీలించి , మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ పరీక్షలు జ్వరంతో వచ్చే ప్రతి రోగికి పరీక్షించాలని ల్యాబ్ టెక్నీషియన్ కు సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని ఇతర సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని వైద్య సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివాజీ హెడ్నర్స్ సరస్వతి ల్యాబ్ టెక్నీషియన్ గురుదేవ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………….