* మృతుల్లో ఇద్దరు మహిళా మావోలు
* ఇటీవలి కాలంలోనే మొత్తం 37 మంది మృతి
ఆకేరు న్యూస్, ఛత్తీస్గఢ్ :
మహారాష్ట్ర సరిహద్దుల్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్ర- నారాయణ పూర్ సరిహద్దులో మరోసారి తుపాకుల మోత మోగింది. అబుజ్మడ్ అడవుల్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు. ఈక్రమంలో మావోలు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోలు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయారని అడిషనల్ ఎస్పీ రాబిన్ సన్ చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు వివరించారు. మృతి చెందిన మావోల పేర్లు తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలోనే మొత్తం 37 మంది మావోయిస్టులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.
———————————-