
* భారీ వాహనాలపై ఆంక్షలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సిటీలో భారీ వాహనాల రాకపోకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం వేళ హైదరాబాద్ లో చాలా రద్దీగా ఉంటుంది. పాఠశాలల వేళలు,కళాశాలల వేళలు,ఆఫీస్ వేళలు కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆ సమయంలో భారీ వాహనాలు సిటీలోకి ఎంట్రీ అయితే ఇతర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కొక్కసారి భారీ వాహనాలు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీంతో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇక నుంచి డీసీఎం,రెడిమిక్స్ వాహనాలను ఉదయం వేళలో సిటీలోకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.డీసీఎం, రెడీమిక్స్ వాహనాలను ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అనుమతి ఇచ్చారు.తిరిగి రాత్రి 10.30 నుంచి ఉదయం 7.30 గంటల మధ్య రాకపోకలకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి ఉండే రెడీమిక్స్ కాంక్రీట్ వాహనాలు, సీ అండ్ డీ వాహనాలను అన్ని మార్గాల్లో అనుమతిస్తామన్నారు.
………………………………..