
* ప్లాటు విషయంలో వివాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీ నటుడు, ప్రముఖ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల(Rajeev Kanakala)కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్లాటు అమ్మిన వ్యవహారంలో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో(Hayathnagar) కేసు నమోదు అయ్యింది. ఇదే కేసు విషయంలో విచారణకు హాజరు కావాలని విట్నెస్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్ పేట మునిసిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ప్లాట(Dispute Plot)ను సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని.. అదే ఫ్లాటును మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు విజయ్ చౌదరి అమ్మారని.. అక్కడ లేని ప్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్ లో కేసు నమోదు పోలీసులు. అలాగే ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు. అనారోగ్యం కారణాలతో ఇప్పుడు రాలేనని, విచారణకు తర్వాత హాజరవుతానని ఆయన పోలీసులకు తెలిపారు.
…………………………………