
* ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా..
* హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : తన తాత ఆశయాలను కొనసాగిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్దికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడిత ప్రణవ్ అన్నారు. గురువారం మాజీ రాజ్యసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వొడితల రాజేశ్వర్ రావు 14 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ తన తాత రాజేశ్వర్ రావు ఆశయాల సాధనకు కృషి చేస్తాను అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని,ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య,వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు.అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, అభిమానులు,నాయకులతో,కార్యకర్తలతో కలిసి ప్రణవ్ భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర రావు అభిమానులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
…………………………………….