
* అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
* రైతులు ఆందోళన చెందవద్దు
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: ఖరీఫ్ సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను దుకాణాలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.సూచించారు.గురువారం ఏటూరు నాగారం ( ETURU NAGARAM ) మండలం చిన్నబోయిన గ్రామం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లు బుక్కులు, లైసెన్స్ ను పరిశీలించారు. ఈ-పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన, ఎరువుల ( SEEDS FERTILIZERS )దుకాణాదారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలలో విత్తన, ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ బోర్డులను పరిశీలించారు. రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని పిఎసిఎస్ ఇబ్బందికి సూచించారు. నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ వేణుగోపాల్, పి ఎస్ సి ఎస్ సీఈఓ గౌరి, ఏ ఈ ఓ రాజు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
…………………………………