
* విద్యార్థులతో జనగామ కలెక్టర్
ఆకేరు న్యూస్, జనగామః ప్రతి విద్యార్థి పౌష్టికాహరంను తినాలని.. బాగా చదివి ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. జనగామ జి్ల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని కేజీబీవి, జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవిలో వంటశాలను పరిశీలించారు. వంటలో వాడుతున్న సరుకులను, కూరగాయలను పరిశీలించారు. నాణ్యమైన సరుకులను వాడాలని వంట మనుషులకు, సిబ్బందికి సూచించారు. వంటల నాణ్యతలతో ఎలాంటి రాజీ ఉండవద్దని హితువు పలికారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించి 10వ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. యూనిఫార్మ్స్, నోట్ బుక్స్ అందరికీ వచ్చాయా, క్లాసెస్ బాగా జరుగుతున్నాయా, ఏమైనా సబ్జెక్టులు ఇబ్బందికరంగా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఫార్మాటివ్ అసెస్మెంట్ టెస్టులో ఏ ఏ విద్యార్థికి ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చయని తెలుసుకొని ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇప్పటినుంచి ఒక ప్రణాళికతో ముందుకు పోవాలని, బాగా చదువుకోవాలని, చదువు మీద శ్రద్ధ కలగాలంటే ఫస్ట్ అందరూ బాగా తినాలని… ప్రభుత్వం మీరు పౌష్టికంగా ఉండాలని ప్రతి రోజు ఎగ్ పెడుతుందని, పోషకాల తో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని విద్యార్థులందరూ కడుపునిండా తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు. మంచిగా తిన్నప్పుడే చదువు మీద శ్రద్ధ పెట్టి పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
వైద్యశాల సందర్శన
జఫర్గడ్ ప్రభుత్వ దావాఖానాను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డాక్టర్లు ఎవ్వరు ఎప్పుడు వస్తున్నారు, సెలవుల కోసం లెటర్లు పెట్టి జిల్లా అధికారి అనుమతి తీసుకున్నారా లేదా..పని తీరు ఎలా ఉంది.. చికత్స కోసం రోగులు వస్తున్న తీరుతెన్నులను సిబ్బంది, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, సక్రమంగా విధులకు హజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దావాఖానా పరిసరాలను గమనించారు. పచ్చదనం పరిశుభ్రత పాటించాలని హితువు పలికారు.
ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
జఫర్గడ్లో ఉన్న పలు ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎరువులు ప్రభుత్వం సరిపడా అందిస్తుందని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అమ్మాలని, అధిక రేట్లకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ షాపుల యజమానులకు సూచించారు. ఎరువులు ఎంత స్టాక్ ఉందో.. వాటి రేట్లు ఏమిటో ధరలు,స్టాక్ బోర్డుపై రాసి పెట్టాలని అన్నారు. నిబందనల మేరకే ఎరువులు అమ్మాలని అన్నారు. యూరియా జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులకు సరిపడా ఇవ్వాలని సూచించారు. ఎవరైనా యూరియాను బ్లాక్మార్కెట్లో అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
……………………………………