
*బీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేక్ కార్యాలయ ఉద్యోగి నిర్వాకం
* డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లు
* పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఆకేరున్యూస్ హైదరాబాద్ : పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని జీడిమెట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడి మెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ ఎస్ ఎమ్మెల్లే వివేకానంద కార్యాలయంలో పని చేస్తున్న హరిబాబు అనే వ్యక్తి 2020 నుండి 2023 మధ్య కాలంలో జీడిమెట్ల ప్రాంతానికి చెందిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్ష రూపాయలు వసూలు చేశాడు. మొత్తం 84 మంది వద్ద నుంచి ఒక్కక్కరి వద్ద నుంచి లక్ష చొప్పున వసూలు చేశాడు. అయితే తాను కేవలం పాత్ర ధారిని మాత్రమే నని అసలు సూత్రధారులు వేరే ఉన్నట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల కేటాయింపునకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. ఈ పత్రాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గడ్డం శ్రీధర్ ముదిరాజ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జీడిమెట్లకు చెందిన బాధితుడు పైలం రమేష్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది, అయితే కొందరు బాధితులు ఈ వ్యవహారంపై పేర్లు చెప్పడానికి భయపడుతున్నట్లు తెలిసింది.ఇదిలా ఉండగా హరిబాబు అనే వ్యక్తి తన వద్ద ఒకప్పుడు పనిచేసే వాడని డబుల్ బెడ్ రూంల వ్యవహారంలో అతడు డబ్బులు తీసుకుంటున్నట్లు తనకు ఫిర్యాదులు రావడంతో హరిబాబును తన కార్యాలయం నుంచి తప్పించినట్లుగా ఎమ్మెల్యే వివేక్ చెప్తున్నారు.
…………………………………………