
* అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి
ఆకేరు న్యూస్, ములుగు: ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ స్క్రీనింగ్ రాత పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి. అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈ నెల 27వ తేదిన జరుగనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్సుడ్ పరీక్షలు నిర్వహణ పై రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతి రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారి పరీక్షను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని, 26 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నారని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్ పరీక్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో వ్రాత, ప్రాక్టీకల్ పరీక్షలు అదే రోజు ఉదయం 10.00 AM to 1.00 PM, సాయంత్రం 2.00 PM to 5.00 PMనిర్వహిస్తున్నట్లు తెలిపారు. 80 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నారని వివరించారు.
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచియుండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్ష నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రశ్న, జవాబు పత్రాలను పోలీస్ భద్రత నడుమ తరలించాలని సూచించారు.. పరీక్ష కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మంచినీరు సరఫరా చేయాలని, మున్సిపల్, అధికారులు పరీక్షా కేంద్రాల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. సిబ్బంది, పరీక్ష వ్రాసే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యూలేటర్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని, నిశిత పరిశీలన తదుపరి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని తెలిపారు. తనిఖీ చేసే అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా పకడ్బంధిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, ములుగు, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, సూపరింటెండెంట్ శివకుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………