
* చెరువు, కుంటల్లోకి చేరుతున్న వరద నీరు
ఆకేరు న్యూస్, ములుగు: ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లాలోని నరసింహ సాగర్ లో గల మల్లూరు ప్రాజెక్ట్ లక్నవరం, రామప్ప సరస్సు లలో వరద నీరు ఉధృతంగా చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి . రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. నాట్లు వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
……………………………………….