
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి ఎఫ్సిడిఎ కమిషనర్ కె. శశాంక సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జిని పరిశీలించి ఆ గ్రామాలలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐ టి డి ఏ, సమావేశ మందిరంలో అధికారులతో భారీ వర్షాలు, వరదల పై సంసిద్ధత సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరిష్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంత రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………..