
మంత్రి ధనసరి అనసూయ సీతక్క
* ఏజెన్సీ ఏరియాలను పట్టించుకోలేదు
* గిరిజన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : గిరిజనుల కోసం ఉపయోగించాల్సిన నిధులను గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పక్కదారి పట్టించారని మంత్రి సీతక్క( MINISTER SEETHAKKA )ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మసబ్ ట్యాంక్ లో ఉన్న దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు.బీఆర్ ఎస్ ( BRS) హయాంలో ఏజెన్సీ ఏరియా (AGENCY ARIAS)లు వెనుకబడి పోవడానికి కారణం అదే అని ఆమె అన్నారు.ఎస్టీలకు కేటాయించిన ప్రతీ పైసా వారికోసమే ఉపయోగించాలని ఆమె అన్నారు.ఎస్టీల్లో ఎక్కువమందికి ఉండటానికి ఇండ్లు లేవని తెలిపారు. కాబట్టి ఎస్టీల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
సలహాలు సూచనలు ఇవ్వండి
గిరిజనుల సంక్షేమానికి అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని సీతక్కతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మన్ (ADLURI LAXMAN)అన్నారు.గత బీఆర్ ఎస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఐదేళ్ల తరువాత గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్నిఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY)దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని అన్నారు.
……………………………………..