
The Election Commission has lost its presence in the country.
* లోక్‌సభ ఎన్నికలను కొల్లగొట్టారనడంలో సందేహమే లేదు
* రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీలో జరిగిన వార్షిక న్యాయ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahulgandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో లోపాలను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గురించామని తెలిపారు. రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్(Madyapradhesh), గుజరాత్ (Gujarath)లో కాంగ్రెస్ కు ఒక్క సీటూ రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి ఎక్కువ సీట్లు సాధించిందని, 4 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తుడుచుకు పెట్టుకుని పోయిందన్నారు. 4 నెలల్లోనే అంత వ్యత్యాసం ఎలా వచ్చిందన్నారు. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా కోటి ఓట్లు చేరాయని, ఆ రాష్ట్రంలో 4 నెలల్లోనే అదనంగా కోటి మందిని ఓటర్లుగా చేర్చారని వివరించారు. కొత్తగా చేరిన ఓట్లలో అధిక భాగం బీజేపీకి వెళ్లాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఉనికిలో లేదని దేశానికి చాటే ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈసీ కనుమరుగైందని నిరూపించడానికి 6 నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఆధారాలు సేకరించినట్లు రాహుల్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను కొల్లగొట్టారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఓట్లు వేసిన 6.5 లక్షల మంది ఓటర్లలో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లే అన్నారు. ఎన్నికల్లో ఏదో తప్పు జరుగుతోందని 2014 నుంచి కూడా అనుమానం ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లోనే అనుమానం వచ్చిందన్నారు. ప్రశ్నిస్తే ఆధారాలు అడిగారని తెలిపారు. అందుకే శ్రమించి ఆధారాలు సంపాదించామన్నారు. ఎన్నికల్లో స్వీప్ చేసే విజయాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.
—————————-