
Revanth Reddy
* మోదీ పదవిని వదులుకోవాలి
*ఏఐసీసీ లీగల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : రాహుల్ గాంధీ ( RAHUL GANDHI) తలుచుకుంటే ఎప్పుడో ప్రధాని అయ్యేవాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ లీగల్ సెల్ (AICC LEGAL CELL)సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందన్నారు. ఇందిరా గాంధీ,(INDIRA GANDHI) రాజీవ్ గాంధీ(RAJIV GANDHI) లు తీవ్ర వాదానికి వ్యతిరేకంగా పోరాడి తమ జీవితాలను త్యాగం చేశారని సీఎం గుర్తు చేశారు.సోనియా గాంధీ(SONIA GANDHI) , రాహుల్ గాంధీలు ప్రధాని కావడానికి అవకాశం వచ్చినా రెండు సార్లూ డాక్లర్ మన్ మోహన్ సింగ్ను( DOCTOR MANMOHAN SINGH) ప్రధాని చేశారని రేవంత్ (REVANTH REDDY) అన్నారు.దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ(BJP) తరచూ ప్రశ్నించడాన్ని రేవంత్ ఖండించారు. ఈ దేశానికి స్వతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.అ ధికారం ఉన్నా లేక పోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ (NARENDRA MODI)పదవి వదులుకోవడానికి ఇష్టపడడు అని రేవంత్ అన్నారు.2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీజేపీ . ఆర్ ఎస్ ఎస్ నేతలు మోదీని తప్పించాలని ప్రయత్నిస్తుంటే మోదీ మాత్రం పదవిని వదులుకోవడం లేదని విమర్శించారు. ఆర్ ఎస్ ఎస్ (RSS) సిద్దాంతం ప్రకారం 75 ఏళ్లు నిండిన వారు పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. మరో రెండుమూడు నెలల్లో 75 ఏళ్లు నిండనున్న మోదీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని రేవంత్ ప్రశ్నించారు. అద్వానీ,(LK ADVANI)మురళి మనోహర్ జోషి( DOCTOR MURALI MANOHAR JOSHI)లకు వర్తించిన నిబంధన మోదీకి వర్తించదా అని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే మోదీ తన పదవి ఎలా కాపాడుకోవాలనే పోరాటం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటకుండా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
—————————————-