
* రాహుల్ గాంధీ మరో సంచలన వీడియో
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎన్నికల కమిషన్, బీజేపీ పై కొద్ది రోజులుగా వరుస ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. ఎక్స్ లో ఓ వీడియో పోస్టు చేసి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కై ఈసీ పనిచేసిందని ఆరోపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (RAHULGANDHI) తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. ఓట్ల దొంగతనం కేవలం ఎన్నికల స్కాం మాత్రమే కాదు.. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహం. దోషుల్లారా ఇది చూడండి. కాలం మారుతుంది. శిక్ష కచ్చితంగా పడుతుంది. అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో ఎన్నికల్లో అక్రమాలు ఎలా జరిగాయో అన్న విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. తాను రాజకీయ కుటుంబంలో పుట్టానని, తనకు ఎన్నికలు అంటే ఏంటో తెలుసని చెప్పారు. 20 ఏళ్లుగా స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని వివరించారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో, పోలింగ్ కేంద్రాలను ఎలా మేనేజ్ చేస్తారో, ఓటరు లిస్టు, ఫామ్ 6, ఫామ్ 17.. అన్నీ తనకు తెలుసునని వివరించారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజల ఆలోచనలు ఒకలా ఉంటే, ఫలితాలు మరో వచ్చాయని తెలిపారు. దేశంలో ఎన్నికల కమిషన్(ELECTION COMMISION), బీజేపీ (BJP) కలిసి ఓట్ల చోరీ పాల్పడుతున్నాయని, ఇది దేశానికి విరుద్ధమని అన్నారు. త్వరలో దోషులకు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
……………………………………….