
SSMB Movie Mahesh babu New stil
* మెడలో శివుడి త్రిశూలం.. నందితో ఉన్న లాకెట్ ..
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని క్రేజీ కాంబో మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. అభిమానులకు కిక్ ఇచ్చేలా గుడ్ న్యూస్ పంచుకున్నారు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి. వారి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి ఓ విషయం అభిమానులతో పంచుకున్నారు. మహేశ్ బాబు బర్త్డే సందర్భంగా SSMB29 ప్రాజెక్ట్ పై ఓ అంశాన్ని వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్లో ప్రపంచ యాత్రికుడు(GlobeTrotter)ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మహేశ్ బాబు మొహం కనిపించకుండా శివుడి త్రిశులం, నందితో ఉన్న లాకేట్ను ధరించి ఉన్నాడు. దీంతో ఈ సినిమాలో తమ అభిమాన హీరో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నవంబర్ ఎప్పుడు? అని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఆ ప్రపంచ యాత్రికుడి రూపాన్ని చూడాలని ఉందని పేర్కొంటున్నారు.
——————-